Thu Nov 07 2024 13:03:42 GMT+0000 (Coordinated Universal Time)
ఈ సారి ఆస్కార్ వేడుకల్లో ప్రత్యేకతలివే.. ఆమె డ్రస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ అట
తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట.
ప్రస్తుతం యావత్ ప్రపంచం దృష్టంతా ఆస్కార్ అవార్డుల వేడుకలపైనే ఉంది. ఈ వేడుక కోసం చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రియులంతా ఆస్కార్ కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక ప్రారంభం కానుంది. సినీరంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ కోసం మన తెలుగు సినిమా అయిన ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ సినిమాలతో పోటీ పడుతోంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఈ సినిమాలోని నాటు నాటు సాంగ్ నామినేట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి ఆస్కార్ అందుకోవాలని తెలుగు ప్రేక్షకులకు కోరుకుంటున్నారు.
2023 ఆస్కార్ అవార్డుల్లో కొన్ని మార్పులు జరిగాయి. ఈసారి అతిథులకు స్వాగతం పలికేది రెడ్ కార్పెట్ కాదు. షాంపైన్. పేరుకు మాత్రమే రెడ్ కార్పెట్.. కానీ రంగు మాత్రం అది కాదు. “షాంపైన్” కలర్ గా మార్చేశారు. తొలిసారి ఈ రెడ్ కార్పెట్ కలర్ ను మారుస్తున్నారు. 50 000 స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్ అట. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టింది అని సమాచారం. ఇక ఈసారి ఈ అవార్డుల వేడుక కోసం 56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. అంటే మన కరెన్సీలో అక్షరాలా 463 కోట్ల 92 లక్షల 47 వేల 300 రూపాయలు. ఇందులో.. కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందని సమాచారం. అలాగే.. ఆస్కార్ ఈవెంట్ లో ఎవరైనా ప్రకటనలు ఇవ్వాలంటే.. 30 సెకన్లకు రెండు మిలియన్ డాలర్లు కట్టాల్సి ఉంటుందట.
Next Story