Fri Nov 22 2024 21:27:57 GMT+0000 (Coordinated Universal Time)
విరిగిపడిన కొండచరియలు.. 36 మంది మృతి
వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో.. బురద మట్టి, రాళ్లు పేరుకుపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
దక్షిణ అమెరికాలోని పెరూలో.. కొండచరియలు విరిగిపడటంతో 36 మంది మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పెరూలో ఫిబ్రవరి నెలలో అధికవర్షపాతం ఉంటుంది. ఈ ఏడాది కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కొండచరియలు విరిగి.. ప్రజా నివాసాలపై పడుతున్నాయి. ఫలితంగా కొండ దిగువన ఉన్న గ్రామీణ ప్రాంతాలకు భారీ నష్టం కలుగుతోంది. పెద్దపెద్ద రాళ్లు, మట్టి పెళ్లలు పడుతుంటడంతో.. ప్రాణాలు కోల్పోతున్నారు. ఇళ్లు ధ్వంసమవుతున్నాయి. రోడ్లు దెబ్బతిని.. వాహనాల రాకపోకలు స్తంభిస్తున్నాయి.
వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటంతో.. బురద మట్టి, రాళ్లు పేరుకుపోయి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. సోమవారం(ఫిబ్రవరి6) రోడ్డుపై వ్యాన్‌లో ఐదుగురు వ్యక్తులు వెళ్తుండగా, కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండ పై నుంచి పడ్డ మట్టి కొట్టుకొచ్చి, వాహనాన్ని దగ్గర్లోని నదిలోకి నెట్టేసింది. ఈ ఘటనలో వ్యాన్‌లోని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొండచరియలు విరిగిపడుతున్న ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ప్రమాదంలో పలువురు గల్లంతవ్వగా.. వారికోసం గాలిస్తున్నారు. అధికారుల అంచనా ప్రకారం ఇప్పటివరకు 650కి పైగా ఇండ్లు ధ్వంసమయ్యాయి. తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి.. కొండ దిగువన ఉన్న ప్రజల్ని వాటిలోకి తరలిస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు వంటివి అందిస్తున్నారు.
- Tags
- Landslides
- peru
Next Story