Sun Dec 22 2024 19:41:50 GMT+0000 (Coordinated Universal Time)
Pak Elections : పాక్ లో మళ్లీ ఆ పార్టీదే హవానా?
పాకిస్థాన్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. కౌంటింగ్ జరుగుతుంది. పోటా పోటీగా ఫలితాలు వెలువడుతున్నాయి
పాకిస్థాన్ ఎన్నికల పోలింగ్ పూర్తయింది. కౌంటింగ్ జరుగుతుంది. అయితే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులతో పాటు పీపీీీపీ, పీఎంఎల్ పార్టీ అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఆధిక్యంలో ఉన్నారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వివిధ కేసుల్లో ఇరుక్కుని జైలు శిక్ష పడటం, ఆయనతో పాటు ఎక్కువ సంఖ్యలో పోటీ చేయలేదు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న పీటీఐ అనేక నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లకు మద్దతు ఇచ్చింది. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ మంది లీడ్ లో ఉన్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలిసింది.
పోటా పోటీగా...
ఇప్పటి వరకూ ఇమ్రాన్ మద్దతిచ్చిన స్వతంత్రులు ఐదు స్థానాల్లోనూ, పీపీపీ, నవాజ్ షరీఫ్ కు చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ అభ్యర్థులు కూడా ఐదు స్థానాలు గెలుచుకున్నాయి. ఇమ్రాన్ కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ అనేక చోట్ల పోటీచేయకపోవడంతో పీపీపీ, పీఎంఎల్ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తున్నారు. ఏ పార్టీకి 134 సీట్లు వస్తే ఆ పార్టీ అధికారంలోకి వచ్చినట్లే. దేశ వ్యాప్తంగా 266 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతుంది. పోటా పోటీగా అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు.
Next Story