Sat Dec 28 2024 04:06:24 GMT+0000 (Coordinated Universal Time)
పాకిస్థాన్ ప్రధాన మంత్రి అతడే
పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగిన మూడు వారాలకు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు జరిగింది.
అసలు అక్కడ ఎన్నికలు జరిగాయో.. లేక టెస్ట్ మ్యాచ్ జరిగిందో తెలియదు. థర్డ్ అంపైర్ నిర్ణయం కోసం ఎదురుచూసినట్లుగా అందరూ ఎదురుచూశారు. ఎవరిది విజయమో తెలియని పరిస్థితుల మధ్య పాకిస్థాన్ ఎన్నికల సంఘం.. ఒక ప్రకటన చేసింది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలిచినా కూడా మిగిలిన ముఖ్యమైన పార్టీలు చక్రం తిప్పాయి. చివరికి ఇమ్రాన్ వర్గానికి షాక్ ఇచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కు చెప్పడానికి ఏమీ లేదు.. చేయడానికి అసలు లేదు. దీంతో మిగిలిన వాళ్లు చక్రం తిప్పగలిగారు.
పాకిస్థాన్ లో ఎన్నికలు జరిగిన మూడు వారాలకు సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు జరిగింది. పాకిస్థాన్ పార్లమెంటు ఆదివారం నాడు షెహబాజ్ షరీఫ్‌ను రెండవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. పాకిస్తాన్‌లోని ఓటర్లు ఫిబ్రవరి 8న పోలింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో ఊహించని ఘటనలు చోటు చేసుకున్నాయి. మొబైల్ ఇంటర్నెట్ షట్‌డౌన్ అయింది. పలువురిని అరెస్టు చేశారు.. ఊహించని హింసాకాండ కారణంగా ఫలితాలు ఆలస్యం అయ్యాయి, భారీ రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
నవాజ్ షరీఫ్.. మూడుసార్లు ప్రధానమంత్రి అయిన నవాజ్ షరీఫ్ తమ్ముడు. పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించాడు. ఇమ్రాన్ ఖాన్ మద్దతు ఉన్న అభ్యర్థులు అత్యధిక స్థానాలలో గెలుపొందారు. అయితే PML-N, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అంగీకరించాయి. షెహబాజ్ షరీఫ్ తన సోదరుడు పక్కకు తప్పుకోవడంతో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాడు.
Next Story