Mon Dec 23 2024 08:13:40 GMT+0000 (Coordinated Universal Time)
నో ఫ్లై లిస్టులో ఇమ్రాన్ ఖాన్
తన పేరును నో ఫ్లై లిస్టులో చేర్చడంపై ఇమ్రాన్ స్పందించారు. తాను దేశం విడిచి..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఓ అవినీతి కేసులో అరెస్టైన విషయం తెలిసిందే. ఇస్లామాబాద్ కోర్టులో ఆయన అరెస్టయ్యారు. అతికష్టం మీద సుప్రీంకర్టు జోక్యంతో విడుదలయ్యారు. ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ 150 వరకూ కేసులు, తీవ్రవాద ఆరోపణలపై మరికొన్ని కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ను కట్టడి చేసే ఏ ఒక్క అవకాశాన్ని అక్కడి ప్రభుత్వం వదులుకోవట్లేదు.
బెయిల్ పై విడుదలైన ఇమ్రాన్ ఖాన్ దేశం విడిచిపారిపోకుండా ఉండేందుకు అతని పేరును నో ఫ్లై లిస్టులో చర్చింది పాక్ ప్రభుత్వం. ఆయనతో పాటు భార్య బుష్రా బీబీ, ఇమ్రాన్ పార్టీ పీటీఐకి చెందిన పలువురు నేతల పేర్లను కూడా నో ఫ్లై జాబితాలో చేర్చింది. తన పేరును నో ఫ్లై లిస్టులో చేర్చడంపై ఇమ్రాన్ స్పందించారు. తాను దేశం విడిచి పారిపోవడానికి.. ఇతర దేశాల్లో తనకు ఆస్తులు, వ్యాపారాలు లేవని.. బ్యాంక్ అకౌంట్లు కూడా లేవన్నారు. తనను నో ఫ్లై జాబితాలో చేర్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాక్ మీడియా కథనం ప్రకారం 600 మంది పీటీఐ నేతలను ప్రభుత్వం నో ఫ్లై లిస్టులో చేర్చినట్టు సమాచారం. పీటీఐ పార్టీనే లేకుండా చేయాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. మే 9న జరిగిన హింసను దృష్టిలో ఉంచుకుని, పీటీఐ పార్టీపై నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తున్నామని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజ ఆసిఫ్ తెలిపారు.
Next Story