Tue Dec 17 2024 11:59:27 GMT+0000 (Coordinated Universal Time)
పాక్ ప్రధానికి జరిమానా .. ఎందుకంటే ?
ఈసీ ఆదేశాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బేఖాతరు చేశారు. ఈసీ ఆదేశాలు ఇచ్చిన మర్నాడే ప్రధాని ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు.
పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు ఆ దేశ ఎలక్షన్ కమిషన్ జరిమానా విధించింది. ఇటీవల పాక్ లోని స్వాత్ లో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని.. అక్కడ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు రూ.50 వేలు జరిమానా విధించింది ఈసీ. కైబర్ - ఫంఖ్తున్క్వాలో స్థానిక ప్రభుత్వ ఎన్నికలు జరుగుతుండగా ప్రచారంలో పాల్గొనరాదని, మార్చి 15న స్వాత్ ను సందర్శించొద్దని, అక్కడ జరిగే బహిరంగ సభలకు వెళ్లొద్దంటూ ఈసీ నిషేధాన్ని విధించింది.
ఈసీ ఆదేశాలను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బేఖాతరు చేశారు. ఈసీ ఆదేశాలు ఇచ్చిన మర్నాడే ప్రధాని ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రకారం.. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ప్రభుత్వ ప్రతినిధులు పర్యటించారు. మార్చి 31న కైబర్ పంఖ్తున్క్వాలో రెండో దశ ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన ప్రధానికి రెండు సార్లు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఇమ్రాన్ ఖాన్ తో పాటు.. పాక్ విదేశాంగ శాఖ మంత్రి షా మెహమ్మూద్ ఖురేషీ, ఖైబర్ పంక్తున్క్వా సీఎం మొహమూద్ ఖాన్, మురాద్ సయ్యద్, డా. అంజద్ అలీ, మొహీబుల్లాలకు జరిమానాలు విధించారు.
Next Story