Mon Dec 23 2024 04:19:25 GMT+0000 (Coordinated Universal Time)
Pakistan : పాక్ లో మెరుగుపడని ఆర్థిక పరిస్థితి...డజన్ కోడిగుడ్లు నాలుగు వందలట
పాకిస్థాన్ లో గత కొన్ని నెలలుగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది
పాకిస్థాన్ లో గత కొన్ని నెలలుగా ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయలేకపోతున్నారు. పాక్ ఆర్థిక పరిస్థిితి క్షీణించడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. శ్రీలంకలో కొంత పరిస్థితి కుదుటపడినా పాక్ లో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. ద్రవ్యోల్బణంతో పాక్ ప్రజలు తినడానికి తిండి కూడా కొనడానికి ఇబ్బంది పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. పెట్రోలు, డీజిల్, కోడి గుడ్లు, బ్రెడ్లు, గోధుమ పిండి ఇలా ఒకటేమిటి అన్ని ధరలు పెరిగిపోయాయి.
రోడ్ల మీదకు వచ్చి....
దీంతో పాక్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు కూడా తెలియజేస్తున్నారు. డజన్ కోడి గుడ్లు ప్రస్తుతం పాకిస్థాన్ లో నాలుగు వందల రూపాయలు ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పాకిస్థాన్ లో ధరలకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించడం విశేషం. ఉల్లిపాయలు కిలో రెండు వందల యాభై రూపాయలుగా ఉందట. ఇక పెట్రోలు, డీజిల్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. లీటరు పెట్రోలు ధర రెండు వందల యాభై రూపాయలు దాటి ఎప్పుడో అయిపోయింది.
ఏదీ కొనలేక...
కిలో గోధుమ పిండి కూడా వందల రూపాయలు పలుకుతుండటంతో ప్రజలు తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్నారు. ప్రపంచ బ్యాంకు ఈ పరిస్థిితిని చూసి పదిహేను మిలియన్ డాలర్లను రుణంగా ఇచ్చినా పరిస్థితిలో మార్పులేదు. విద్యుత్తు కూడా లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే పరిస్థిితి లేదు. దొరికిన కాడికి అన్ని చోట్లా అప్పులు చేసినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేకపోవడంతో ఇప్పటికీ పాక్ ప్రజల పరిస్థితి దినదినగండంగా మారింది. ఇలా కొన్ని రోజులు సాగితే సివిల్ వార్ వచ్చే అవకాశముందన్న అంచనాలు కూడా వినపడుతున్నాయి.
Next Story