Fri Nov 22 2024 14:38:30 GMT+0000 (Coordinated Universal Time)
Pirates : నౌకను ఎత్తుకెళ్లిపోయారు.. ఆ నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నా.. సముద్రపు దొంగలు
సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను హైజాక్ చేసి సొమ్ము చేేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
సముద్రపు దొంగలు రెచ్చిపోతున్నారు. సముద్రంలో ప్రయాణించే నౌకలను హైజాక్ చేసి సొమ్ము చేేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బంగ్లాదేశ్‌కు చెందిన ఒక నౌకన్ హిందూమహాసముద్రంలో సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినట్లు తెలిసింది. నౌకను హైజాక్ చేసిన దొంగలు దానిని సోమాలియా తీరం వైపు తీసుకెళుతున్నట్లు సమాచారం అందినట్లు చెబుతున్నారు.
కార్గో నౌకలను...
సముద్రపు దొంగలు కార్గో నౌకలను హైజాక్ చేయడం ఇటీవల కాలంలో సాధారణంగా మారింది. నౌకలు సముద్రంలో ప్రయాణించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకునే వరకూ యాజమాన్యానికి టెన్షన్ తప్పేట్లు లేదు. మంగళవారం హైజాక్ అయిన కార్గో నౌక బంగ్లాదేశ్ కు చెందిందని, దానిని సముద్రపు దొంగలు ఎత్తుకు వెళ్లారని అన్నారు. నౌకను సముద్రపు దొంగలు ఎత్తుకెళ్లిన సమయంలో నౌకలో 23 మంది సిబ్బంది ఉన్నట్లు నౌక యాజమాన్యం ప్రకటించింది.
23 మంది సిబ్బందితో...
ఈ నౌక మొజాంబిక్ నుంచి బొగ్గును లోడ్ చేసుకుని యునైటెడ్ అరబ్, ఎమిరేట్స్ కు బయలుదేరిందని చెబుతున్నారు. సముద్రపు దొంగలు ఆయుధాలతో నౌకలో ప్రవేశించి తమ అధీనంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. సోమాలియా పైరెట్లే ఈ హైజాక్ కు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. హైజాక్ గురైన నౌక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సిబ్బంది ఇప్పటి వరకూ అయితే సురక్షితంగానే ఉన్నారని అంటున్నారు. తరచూ సముద్రపు దొంగలు నౌకలను అపహరించుకుని ఎత్తుకుపోతుండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story