Mon Dec 30 2024 22:25:59 GMT+0000 (Coordinated Universal Time)
మృత్యుంజయులు ఇద్దరే ..179 మంది మృతి
దక్షిణ కొరియాలో జరిగిన విమాద ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈదుర్ఖటనలో 179 మంది మరణించారు
దక్షిణ కొరియాలో జరిగిన విమాద ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈదుర్ఖటనలో 179 మంది మరణించారు. ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని ఆదివారం ఉదయాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. మయూన్ ఎయిర్ పోర్టు రన్ వేపై విమానం అదుపుతప్పి గోడను ఢీకొట్టడంతో ఈ విమాన ప్రమాదం జరిగింది. అయితే బ్రేకులు పడకపోవడం వల్లనే విమానం నేరుగా వెళ్లి రక్షణ గోడను ఢీకొట్టిందని ప్రాధమికంగా అందుతున్న సమాచారం.
మంటలు చెలరేగి...
విమానం గోడను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం ఒక్కసారిగా పేలిపోయింది. ఈ విమానం ప్రమాదానికి గురైన సమయంలో 175 మంది వరకూ ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారని తెలిసింది. ఈ విమానం బ్యాంకాంగ్ నుంచి మయూన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ పోర్టులోనే జరగడంతో వెంటనే సహాయక కార్యక్రమాలను ప్రారంభించినప్పటికీ ఇద్దరిని మాత్రమే రక్షించగలిగారు. ల్యాండింగ్ గేర్ సమస్య ఈ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు.
గేర్ పనిచేయకపోవడంతోనే...
అయితే బ్రేకులు పనిచేయకపోవడంతో పాటు గేర్ కూడా పనిచేయకపోవడం వల్లనే గోడకు ఢీకొని ఇంతటి ఘోర ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇటీవల వరసగా విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. విమాన ప్రయాణమంటేనే భయపడిపోతున్నారు. ఈ నెలలో ఇది రెడో విమాన ప్రమాదమని చెబుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. పూర్తి విచారణకు ఆదేశించింది.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now
Next Story