Mon Dec 23 2024 05:08:38 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికా ఎన్నిక... తొలి ఫలితంలో ఎవరికి ఎన్ని ఓట్లంటే?
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ మొదలయిన తర్వాత కొన్ని గంటల తర్వాత తొలి ఫలితం కూడా వచ్చేసింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. పోలింగ్ మొదలయిన తర్వాత కొన్ని గంటల తర్వాత తొలి ఫలితం కూడా వచ్చేసింది. న్యూహ్యాంప్ షైర్ రాష్ట్రంలోని డిక్స్ విల్లేలో తొలి రిజల్ట్ వచ్చేసింది. అక్కడ మొత్తం ఆరు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఆరింటిలో మూడు డెమొక్రాటిక్ అభ్యర్థి కమలాహారిస్కు, మరో మూడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కు వచ్చాయి.
చెరిసగం...
ఈ డిక్స్ విల్లే నాచ్ అమెరికా - కెనడా సరిహద్దుల్లో ఉన్న ప్రాంతం. ఇక్కడ ప్రస్తుతం ఆరుగురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. దీంతో రెండు పార్టీలకు చెరి సగం ఓట్లు రావడంతో ఈ ఎన్నిక ఎంత క్లిష్టంగా మారనుందో తొలి ఫలితం స్పష్టం చేస్తుంది. చెరి సగం ఓట్లు రావడంతో ఓటర్ల నాడి రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే ఉంటుందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
Next Story