Fri Nov 22 2024 12:09:32 GMT+0000 (Coordinated Universal Time)
భారీ భూకంపం.. సునామీ భయం
భారీ భూకంపం సంభవించింది.. 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లో శనివారం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. నాలుగు భారీ ప్రకంపనలు రావడంతో సునామీ భయంతో తీర ప్రాంతాల నుండి నివాసితులు అక్కడి నుండి పారిపోతున్నాయి.
దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని మిందానాలో రిక్టర్ స్కేల్‌పై 7.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు ఫిలిప్పీన్స్ సిస్మాలజీ ఏజెన్సీ ఫివోల్క్స్ తెలిపింది. భూకంప కారణంగా దక్షిణ జపాన్ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. పిలిప్పీన్స్ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో అలలు 3 మీటర్ల ఎత్తునకు ఎగిసిపడే ప్రమాదం ఉందని అమెరికా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం తెల్లవారుజామున, 6.4, 6.2, 6.1, 6.0 తీవ్రతతో మరో నాలుగు శక్తివంతమైన ప్రకంపనలు వచ్చాయి. పసిఫిక్ తీర ప్రాంతం, ఈశాన్య మిండనావోలోని నివాసితులు భవనాల నుండి పారిపోయారు. ఎత్తైన ప్రదేశాలను చేరుకున్నారు. హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం కూడా సునామీ హెచ్చరికలు మొదట జారీ చేసినప్పటికీ.. ప్రమాదం దాటిపోయిందని ఆ తర్వాత పోస్ట్ చేసింది.
Next Story