Sun Nov 24 2024 12:51:11 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు ఖతార్ లో ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఖతార్ చేరుకున్నారు. ద్వైపాక్షిక చర్చలలో ప్రధాని పాల్గొననున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఖతార్ చేరుకున్నారు. ద్వైపాక్షిక చర్చలలో ప్రధాని పాల్గొననున్నారు. ప్రధాని ఖతార్ పర్యటనలో భాగంగా ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ ధానీ తో పాటు ఇతర్ ఉన్నతాధికారులతో సమావేశమై ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి చర్చించనున్నారు. ఖతార్ లో చట్టాలు కూడా తీవ్రంగా ఉ:టాయి. ఇటీవల గూఢచర్యం నేరంపై భారత నేవీ మాజీ అధికారులను ఉరిశిక్ష నుంచి తప్పించి విడుదల చేయించడం భారత్ కు తలప్రాణం తోకకు వచ్చినట్లయింది.
పెట్రోలియం ఉత్పత్తులపై...
ఉపాధి, వాణిజ్యంపై ఇరు దేశాల అధినేతలు చర్చించే అవకాశముంది. ఎల్పీజీ ఖతార్ నుంచి భారత్ 29 శాతం దిగుమతి చేసుకుంటుంది. 48 శఆతం ఎల్ఎన్జీ ని కూడా భారత్ అక్కడి నుంచే తెచ్చుకుంటుంది. ఈరోజు జరిగే చర్చల్లో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతులకు సంబంధించి కూడా ఉండనుంది. పరస్పరం పెట్టుబడుల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఖతార్ జనాభాలో 27 శాతం ఉన్న భారతీయుల రక్షణకు సంబంధించి కూడా చర్చించనున్నారు.
Next Story