Sun Apr 06 2025 16:02:18 GMT+0000 (Coordinated Universal Time)
అబుదాబిలో ఆలయాన్ని ప్రారంభించిన మోదీ
అబుదాబిలో ప్రధాని నరేంద్ర మోదీ హిందూ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు.

అబుదాబిలో ప్రధాని నరేంద్ర మోదీ హిందూ దేవాలయాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఏడు వందల కోట్ల రూపాయల వ్యయంతో 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయాన్ని నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అరబ్ దేశాల్లో అతి పెద్ద హిందూ ఆలయంగా దీనికి పేరుంది. ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు నిన్ననే ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చేరుకున్నారు. బీఏపీఎస్ సంస్థ ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది. రాజస్థాన్, గుజరాత్ ల నుంచి రెండు వేల మంది కార్మికులను తీసుకెళ్లి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
అనేక విశేషాలు....
ఆలయ శిఖరం ఎత్తు 108 అడుగులుగా నిర్మించారు. సెవెన్ ఎమిరేట్స్ సూచించే విధంగా ఏడు శిఖరాలను ఏర్పాటు చేశారు. రెండు గోపురాలు, ఏడు శిఖరాలు, 402 స్థంభాలతో నిర్మించారు. 2015 లో భూమిని సేకరించి మూడున్నరేళ్ల పాటు ఆలయ నిర్మాణం సాగింది. 2018 లో ఆ ఆలయనిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. భూకంపాలను తట్టుకునేలా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ప్రార్థన మందిరంతో పాటు లైబ్రరీ కూడా అందరినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. భగవాన్ శ్రీ స్వామి నారాయణ సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది.
Next Story