Fri Nov 22 2024 18:23:56 GMT+0000 (Coordinated Universal Time)
19న లండన్ లో క్వీన్ ఎలిజబెత్ 2 అంత్యక్రియలు
క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలను ఈనెల 19న లండన్ లో నిర్వహించనున్నట్లు బ్రిటన్ అధికారిక వర్గాలు..
బ్రిటన్ మహారాణి క్వీన్ ఎలిజబెత్ (96) అనారోగ్యంతో నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసింది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలను ఈనెల 19న లండన్ లో నిర్వహించనున్నట్లు బ్రిటన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. 70 ఏళ్లపాటు బ్రిటన్ కు రాణిగా కొనసాగిన ఆమెకు.. ఘనంగా తుది వీడ్కోలు పలికేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో ఎలిజబెత్ అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
రాణి భౌతిక కాయాన్ని ఉంచిన పేటికను రాచకుటుంబ సభ్యులు వెంటరాగా వెస్ట్ మినిస్టర్ అబ్బేకు తరలించనున్నారు. అక్కడ అందరూ రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం.. పేటికను విండ్సర్ కోటకు తీసుకెళ్తారు. అందులోని సెయింట్ జార్జ్ చాపెల్ కు తరలించి క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియల తంతు పూర్తి చేయనున్నారు. చివరిగా కింగ్ జార్జ్ 4 మెమొరియల్ చాపెల్ లో ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ సమాధి పక్కన ఆమె శవ పేటికను ఖననం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Next Story