Tue Dec 24 2024 00:35:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : లంకాధీశుడు విక్రమ్ సింఘే
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు, విక్రమ్ సింఘే కు మద్దతుగా 134 ఓట్లు వచ్చాయి
![బ్రేకింగ్ : లంకాధీశుడు విక్రమ్ సింఘే బ్రేకింగ్ : లంకాధీశుడు విక్రమ్ సింఘే](https://www.telugupost.com/h-upload/2022/07/20/1393227-rani-vikaam-singhee.webp)
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు, విక్రమ్ సింఘే కు మద్దతుగా 134 ఓట్లు వచ్చాయి. దీంతో శ్రీలంక ఎనిమిదవ అధ్యక్షుడిగా ఆయన ఎన్నికయ్యారు. కొద్దిసేపటి క్రితం జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులు రణిల్ విక్రమ్ సింఘేను ఎన్నుకున్నారు. రాజపక్సే కు అత్యంత సన్నిహితుడిగా రణిల్ విక్రమ్ సింఘే ముద్రపడ్డారు. అందుకే ఆయనను ఎంపీలందరూ ఎన్నుకున్నారు. 220 ఎంపీల్లో అత్యధికశాతం మంది ఓటు వేయడంతో రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు.
ప్రజల్లో వ్యతిరేకత ఉన్నా.
విక్రమ్ సింఘే పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఆయన రాజపక్సే కుటుంబం దేశం విడిచి పారిపోవడానికి సహకరించారని శ్రీలంక వాసులు మండి పడుతున్నారు. ఆయన భవనాన్ని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. అయినా సరే ఎంపీలు మాత్రం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఎంపీలు విక్రమ్ సింఘేను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంకను విక్రమ్ సింఘే ఎలా బయటపడేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story