Fri Nov 08 2024 21:06:00 GMT+0000 (Coordinated Universal Time)
క్షీణించిన నిత్యానంద ఆరోగ్యం.. వైద్యం అందించాలంటూ శ్రీలంకకు విజ్ఞప్తి
పలు నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామి అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన విషయం
ప్రముఖ వివాదాస్పద మతగురువైన నిత్యానందస్వామి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తనకు తక్షణమే వైద్య సేవలు అవసరమని, కైలాస ద్వీపంలో వైద్యం ఇంకా అందుబాటులో లేదని.. వైద్యం అందించాలని కోరుతూ శ్రీలంక ప్రభుత్వానికి నిత్యానంద విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన శిష్యులు శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాశారు. వైద్యం కోసం అయ్యే అన్ని ఖర్చులను తామే భరిస్తామని, ఆపై శ్రీలంకలో పెట్టుబడులు కూడా పెడతామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆగస్టు 7వ తేదీన శ్రీలంక అధ్యక్షుడికి లేఖ రాశారు.
పలు నేరారోపణ కేసుల్లో నిందితుడిగా ఉన్న నిత్యానందస్వామి అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. 2010లో ఓ అత్యాచార కేసులో అరెస్టై విడుదలైన తర్వాత శ్రీ కైలాసం అనే దీవిని కొనుగోలు చేసి.. దానికి కైలాస దేశమని పేరుపెట్టుకుని అక్కడే ఉంటున్నాడు. అంతేకాదు కైలాస ద్వీప కరెన్సీ గా కొత్త కరెన్సీని ముద్రించాడు. కైలాస ద్వీపానికి తనని తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఇప్పుడు తాను అనారోగ్యానికి గురయ్యానని, దీవిలో సరైన వైద్య సదుపాయాలు లేని కారణంగా తనకు అత్యవసరంగా చికిత్స చేయాలని విజ్ఞప్తి చేస్తూ.. శ్రీలంకకు లేఖ రాశారు.
స్థానికంగా ఉన్న అన్ని రకాల వైద్యాలను చేసినా.. అనారోగ్యానికి గల కారణమేంటన్నది అంతుచిక్కనిదిగా మారిందన్నారు. రాజకీయ ఆశ్రయాన్ని వెంటనే మంజూరు చేయాలని, దాంతో ఎయిర్ అంబులెన్స్‌లో వెంటనే నిత్యానందను తరలిస్తామని శ్రీకైలాస విదేశాంగ మంత్రి నిత్యప్రేమాత్మ ఆనంద స్వామి తెలిపారు. అనంతరం శ్రీలంకలో సురక్షిత ప్రదేశంలో వైద్య చికిత్స తీసుకుంటారని పేర్కొన్నారు. వైద్యానికి ఎంతఖరీదైన వైద్య పరికరాలు అవసరమైనా తాము కొనుగోలుచేసుకుంటారమని, నిత్యానందకు చికిత్స అనంతరం వాటిని శ్రీలంకలో విడిచి వెళ్తామన్నారు.
Next Story