Mon Dec 23 2024 08:38:27 GMT+0000 (Coordinated Universal Time)
Houthi Rebels : దాడులు చేసి తీరతాం.. కాచుకోండి అంటున్న హౌతీ రెబల్స్
ఎర్ర సముద్రంలో మరోసారి కలకలం రేగింది. హౌతీ రెబల్స్ ధాటికి అమెరికా షిప్ లో మంటలు చెలరేగాయి
ఎర్ర సముద్రంలో మరోసారి కలకలం రేగింది. హౌతీ రెబల్స్ ధాటికి అమెరికా షిప్ లో మంటలు చెలరేగాయి. హౌతీ రెబల్స్ వరస దాడులు జరుపుతున్నారు. యెమన్ తీరంలో అమెరికాకు చెందిన కంటెయినర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్ పై హౌతీ రెబల్స్ దాడి చేశారు. బాలిస్టిక్ మిసైళ్లతో దాడులు చేయడంతో షిప్ లో మంటలు అలుముకున్నాయి.
భారీగా నష్టం...
హౌతీ రెబల్స్ జరిపిన దాడిలో షిప్ లో మంటలు అంటుకుని పెద్ద స్థాయిలో నష్టం జరిగిందని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. గల్ఫ్ ఆప్ ఎడెన్ లోని మార్షల్ ఐలాండ్ జెండాతో నడుస్తున్న ఈ కంటెయినర్ షిప్ పై హౌతీ రెబల్స్ బాలిస్టిక్ దాడులు చేశారు. తమ దేశం పై దాడికి ప్రతీకార చర్యగా దీనికి పాల్పడినట్లు హౌతీ రెబల్స్ ప్రకటించడం విశేషం.
వదిలి పెట్టబోమంటూ...
తమ దేశంపై దాడికి దిగుతున్న అమెరికా, బ్రిటన్ కు చెందిన యుద్ధనౌకలను తాము వదిలపెట్టమని వారు హెచ్చరికలు జారీ చేశారు. వారిని తమ శత్రువులుగానే పరిగణిస్తామని చెప్పారు. హౌతీ తిరుగుబాటు దారులపై బ్రిటన్, అమెరికా సేనలు దాడులు చేస్తుండటంతో హౌతీ రెబల్స్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని వాటిపై దాడులు చేస్తూ నష్టపర్చాలని నిర్ణయించారు.
Next Story