Mon Dec 23 2024 17:16:32 GMT+0000 (Coordinated Universal Time)
నేడు బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితం
బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. పోటీ లిజ్ ట్రస్, రిషి సునాక్ ల మధ్య తీవ్రంగా ఉంది
బ్రిటన్ ప్రధాని ఎన్నికల ఫలితాలు నేడు రానున్నాయి. ఈ ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతుంది. పోటీ లిజ్ ట్రస్, రిషి సునాక్ ల మధ్య తీవ్రంగా ఉంది. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారంలో ఇద్దరూ హోరా హోరీగా పాల్గొన్నారు. అయితే సర్వేలు మాత్రం లిజ్ ట్రస్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఎక్కువ మంది ట్రస్ వైపు మొగ్గు చూపినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికలో గెలుపు ఎవరిది అన్నది చర్చనీయాంశంగా మారింది.
హోరాహోరీగా...
భారత సంతతికి చెందిన రిషి సునాక్ తొలిదశలో కొంత ముందంజలో ఉన్నా ఆ తర్వాత క్రమంగా వెనకబడి పోయారని సర్వేలు చెబుతున్నాయి. బ్రిటన్ ప్రధానిగా బోరిక్ జాన్సన్ కూడా నేడు తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఫలితాలు నేడు వెలువడటంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. అయితే కొత్తగా ఎన్నికయ్యే ప్రధానికి అనేక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఈ సవాళ్లను అధిగమించడం తొలి టాస్క్ అని పరిశీలకులు చెబుతున్నారు. రిషిక్ సునాక్ మాత్రం తాను ఓడిపోతే ఎంపీగా కొనసాగుతూ తన నియోజకవర్గం కోసం పనిచేస్తానని చెప్పారు.
Next Story