Mon Dec 23 2024 00:10:06 GMT+0000 (Coordinated Universal Time)
America : అమెరికా ఎన్నికల్లో మనోళ్లు.. గెలిచి నిలిచారుగా
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన వారు కూడా విజయం సాధిస్తున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. భారతీయ సంతతికి చెందిన వారు కూడా విజయం సాధిస్తున్నారు. భారతీయ సంతతికి చెందిన సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. డెమొక్రాట్ల తరుపున అభ్యర్థిగా పోటీ చేసిన సుహాస్ సుబ్రహ్మణ్యం విజయం సాదించారు. దీంతో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో విజయంసాధించారు. సుహాస్ సుబ్రహ్మణ్యం గతంలో బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు టెక్ పాలసీ అడ్వయిజర్ గా పనిచేశారు.
డెమొక్రటిక్ అభ్యర్థులుగా...
2020 నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. వర్జీనియా సెనేట్ కు ఎన్నికయ్యారు. సుహాస్ సుబ్రహ్మణ్యంతో పాటు మరో భారతీయ సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి కూడా విజయం సాధించారు. ఇల్లినోయా 8వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ నుంచి రాజా కృష్ణమూర్తి ఎన్నికయ్యారు. ఆయన కూడా డెమొక్రట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. భారతీయ సంతతికి చెందిన మనోళ్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించడం... అదీ డెమొక్రాట్ల తరుపున సాధించడం విశేషం.
Next Story