Sat Nov 23 2024 02:19:39 GMT+0000 (Coordinated Universal Time)
ఎగుమతులపై నిషేధం.. బియ్యం కోసం తెలు"గోడు"..
బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను
ఇతర దేశాల్లో ఉంటున్న తెలుగోడికి రాకూడని కష్టమే వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం సరఫరా దారుగా ఉన్న భారత్.. దేశంలో పెరుగుతున్న ధరలను నియంత్రించేందుకు ఎగుమతులపై నిషేధం విధించింది. ముఖ్యంగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో.. దీని ప్రభావం ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగోళ్లపై (ఎన్నారై) తీవ్రంగా ఉంది. ఎక్కడ బియ్యం కనిపించినా.. ఇలా వెళ్లి అలా కొనేసుకుని దాచుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో చూడండి. కొన్ని మార్ట్స్ లో అయితే బియ్యం కోసం కొట్టుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. అమెరికా సహా.. అగ్రరాజ్యాలన్నింటిలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.
బియ్యం ఎగుమతుల్లో 40 శాతం వాటా కలిగి ఉన్న ఇండియా ఎగుమతులను నిలిపివేయడంతో ధరలు గరిష్ఠ స్థాయికి చేరాయి. ఒక మెట్రిక్ టన్ను ధరలు కనిష్ఠంగా 50 నుంచి 100 డాలర్ల మేర ఎక్కువగా ఉన్నట్లు సింగపూర్ కు చెందిన అంతర్జాతీయ వ్యాపార సంస్థలో ఒక వ్యాపారి తెలిపారు. బియ్యం ఎగుమతులపై విధించిన నిషేధ ప్రభావం.. గోధుమల మార్కెట్లో లాభాలను తెచ్చిపెడుతోంది. ఈ వారంలో 10 శాతం పైనే గోధుమల వ్యాపారంలో లాభాలొచ్చినట్లు నివేదికలు చెబుతున్నారు. ప్రపంచంలో 3 బిలియన్ల కంటే ఎక్కువమంది వరి మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 90 శాతం నీటితో పండించే ఈ పంట ఆసియాలోనే అధికంగా ఉంటుంది. ముందు ముందు బియ్యం ఎగుమతులపై నిషేధం.. ఎన్నారైలపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Next Story