Mon Dec 23 2024 12:59:26 GMT+0000 (Coordinated Universal Time)
రిషీ సునాక్ కు ఛాన్స్?
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషీ సునాక్ కు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషీ సునాక్ కు ఎన్నికయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రధాని పదవి రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో రిషీ సునాక్ కు మార్గం సుగమమయింది. తాను తిరిగి బ్రిటన్ పదవిని చేపట్టే పదవిని చేపట్టేందుకు సరైన సమయం కాదని బోరిస్ జాన్సన్ తెలిపారు. సునాక్ విజయాన్ని సాధించే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
పోటీ ....
బోరిస్ జాన్సన్ బరి నుంచి తప్పుకోవడంతో పెన్నీ మోర్డాంట్, రిషీ సునాక్ ల మధ్య పోటీ జరగనుంది. సునాక్ కు 128 మంది సభ్యుల మద్దతు ఉందని చెబుతున్నారు. తాను బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గట్టెక్కిస్తానని రిషీ సునాక్ చెబుతున్నారు. తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోసారి లభించిన అవకాశం రీషీ సునాక్ కు దక్కుతుందా? లేదా? అన్నది వేచి చూడాల్సి ఉంది.
Next Story