రావాలి రిషి.. కావాలి రిషి
బ్రిటన్ ప్రధాన మంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. బ్రిటన్ ప్రధాని పదివి చేపట్టిన 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవికి ట్రస్ రాజీనామాతో బ్రిటన్ లో మరోమారు రాజకీయ సంక్షోభం నెలకొంది. ఇటీవలే బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన ట్రస్... మినీ బడ్జెట్ ప్రవేశపెట్టి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆర్థిక సంక్షోభాన్ని అదుపు చేయలేక మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో ప్రధాని పదవి రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్ తో పోటీ పడి మరీ లిజ్ ట్రస్ విజయం సాధించారు. ఆమె ప్రభుత్వం ఇటీవలే మినీ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. మినీ బడ్జెట్ పై విమర్శలు చెలరేగడం, అందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతూ ట్రస్ ప్రకటన విడుదల చేయం జరిగింది. అదే సమయంలో దేశంలో ఆర్థిక సంక్షోభం మరోసారి పెరిగిపోవడంతో.. ట్రస్ కేబినెట్ లోని పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మంత్రులు రాజీనామాలు చేయడంతో వ ట్రస్ ప్రధాని పదవికి రాజీనాామా చేశారు. బ్రిటన్ చరిత్రలో అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా ట్రస్ చెత్త రికార్డును సొంతం చేసుకున్నారు.