Thu Nov 21 2024 08:53:40 GMT+0000 (Coordinated Universal Time)
Russia : పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. రష్యా సర్కార్ విన్నూత్న నిర్ణయం
రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది
రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా తగ్గుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. జనాభా పెరుగుదలకు ఆ దేశం అన్ని చర్యలను ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయడం ఇప్పుడు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకట్టుకుంటుంది. ఎక్కడా లేని విధంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అంటూ కొత్త మంత్రిత్వ శాఖను రష్యా ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఎక్కువ మంది పిల్లలను కనేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించేలా రష్యా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎంత ఎక్కువ మంది పిల్లల్ని కంటే అంత ప్రోత్సాహకాలను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమయింది.
జనాభా తగ్గడంతో...
నిజానికి రష్యాలో ఆయు:ప్రమాణాలు పెరగడంతో వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగింది. జనాభా సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇటీవల ఉక్రెయిన్ తో జరిగిన యుద్ధం కారణంగా అనేక మంది మరణించారు. జనాభా కూడా భారీగా తగ్గింది. కుటుంబ వ్యవస్థ పట్ల జనంలో కొంత అభిప్రాయం ఏర్పడటంతో ఎక్కువ మంది పిల్లల్ని కనేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. ఒక కుటుంబం నుంచి ఒకరు సంతానం చాలు అన్న ధోరణికి వచ్చేశారు. ఇది కొంతకాలంగా జరుగుతుండటంతో పాటు ఇటీవల ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధం కారణంగా కూడా రష్యాలో జనాభా దారుణంగా పడిపోయింది.
ప్రత్యేక మంత్రిత్వ శాఖను...
అందుకే రష్యాలో జనాభా పెరుగుదలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, ఆ శాఖ ద్వారా ఎక్కువ మంది పిల్లల్ని కంటే వారికి రాయితీలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కనపడుతుంది. పెళ్లిళ్లు చేసుకోవడం, వెంటనే పిల్లల్ని ఎక్కువ మంది కంటే వారికి ప్రభుత్వ పథకాలతో పాటు ఉద్యోగ అవకాశాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలన్న ఆలోచనలో ఉన్నట్లు కనపడుతుంది. ఇందుకోసం కొన్ని చర్యలను ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. ఇంట్లో ఉండే మహిళలకు జీతాలు చెల్లించాలని, రాత్రి పది గంటల నుంచి రెండు గంటల వరకూ ఇంట్లో లైట్లు, ఇంటర్నెట్ బంద్ చేయాలని, కొత్త జంటలకు హనీమూన్ కు అయ్యే ఖర్చు భరించాలన్న నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మరి ఈ ప్రతిపాదనలన్నీ కొత్త మంత్రిత్వ శాఖ రూపొందించాలని పుతిన్ ఇప్పటికే ఆదేశాలిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Next Story