Mon Dec 23 2024 14:29:17 GMT+0000 (Coordinated Universal Time)
రష్యాకు ఊహించని షాక్.. రష్యన్ వోడ్కాపై నిషేధం విధించిన దేశాలు
పుతిన్ తీరుపై.. అమెరికా సైబర్ దాడితో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సిఫ్ట్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన రష్యాకు మరో ఎదురు దెబ్బ
అమెరికా : ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధంపై ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులపై అగ్రరాజ్యం అమెరికా మొదటి నుంచి మండిపడుతోంది. అమెరికా బాటలోనే అనేక దేశాల ప్రతినిధులు అసహనం వ్యక్తం చేఉస్తున్నారు. సామరస్యంగా పరిష్కరించుకోవాల్సిన విషయాలను యుద్ధం వరకూ తీసుకెళ్లిన పుతిన్ పై ఆయా దేశాల ప్రధానులు, అధ్యక్షులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికైనా యుద్ధాన్ని ఆపి, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారు. కానీ పుతిన్ మాత్రం.. ఎవ్వరి మాట వినని మోనార్క్ ని అన్నట్లు వ్యవహరిస్తున్నారు.
Also Read : మార్చి 7 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
పుతిన్ తీరుపై.. అమెరికా సైబర్ దాడితో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. సిఫ్ట్ దెబ్బతో ఉక్కిరిబిక్కిరి అయిన రష్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పలు దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. తాజాగా రష్యన్ వోడ్కా ను తమ దేశాల్లో బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా, కెనడా ప్రకటించాయి. రష్యాలో తయారైన మద్యం, లిక్కర్ ను బ్యాన్ చేస్తున్నట్లు అమెరికా, కెనడా వెల్లడించాయి. ఈ దెబ్బతో రష్యాలో తయారైన మద్యం విక్రయాలకు ఆ రెండు దేశాల్లో బ్రేక్ పడింది. అమెరికాలో రష్యా బ్రాండ్ లిక్కర్ భారీ మొత్తంలో విక్రయిస్తున్నారు. అమెరికా, కెనడా నిర్ణయంతో రష్యా మద్యం తయారీ వ్యాపారులు ఖంగుతిన్నారు. ఈ నిర్ణయంతో రష్యా మద్యం వ్యాపారంలో భారీ మొత్తంలో నష్టాలొచ్చే అవకాశం ఉంది.
Next Story