Sun Dec 22 2024 13:52:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఉత్తర కొరియాకు పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. ఈరోజు, రేపు పుతిన్ ఉత్తరకొరియాలో పర్యటించున్నారు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నేడు ఉత్తర కొరియాకు వెళ్లనున్నారు. ఈరోజు, రేపు పుతిన్ ఉత్తరకొరియాలో పర్యటించున్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆహ్వానం మేరకు పుతిన్ ఈ పర్యటన చేయనున్నారు. గత ఏడాది ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ రష్యాలో పర్యటించారు.ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేస్తున్న సమయంలో ఆయన పర్యటన అప్పట్లో సంచలనమే అయింది.
24 ఏళ్ల తర్వాత...
తాాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తుండటం కూడా సంచలనమే. ఇరు దేశాల అదినేతలు యుద్ధోన్మాదులు కావడంతో ప్రపంచ దేశాలు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గత ఇరవై నాలుగేళ్లలో ఉత్తర కొరియాలో రష్యా అధ్యక్షుడు పర్యటించడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. అంతర్జాతీయ సమాజం ఈ పర్యటనను ఆసక్తిగా గమనిస్తుంది.
Next Story