Mon Dec 23 2024 10:57:19 GMT+0000 (Coordinated Universal Time)
షాకింగ్.. 70 రోజులుగా ఆ ముగ్గురికీ కరోనా పాజిటివ్ వస్తూనే ఉంది !
ముగ్గురిలో విలక్షణమైన కరోనా లక్షణాలను గుర్తించారు. ఆ ముగ్గురికీ.. నిరంతరాయంగా 70 రోజులుగా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహ
కరోనా వైరస్.. రెండేళ్లుగా ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తోన్న మహమ్మారి ఇది. కొత్త కొత్త వేరియంట్లతో.. అనేక మ్యూటేషన్లతో విజృంభిస్తూనే ఉంది. ఎప్పుడు ఎలా మ్యుటేషన్ చెందుతుందో.. శాస్త్రవేత్తలకు కూడా అంతుపట్టడం లేదు. తాజాగా బ్రెజిల్ నమోదవుతున్న కరోనా కేసులు.. గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కరోనా ప్రారంభ దశలో కంటే.. ఇప్పుడు విలక్షణ కేసులు నమోదవుతున్నాయి. సాధారణంగా కరోనా వైరస్ కు 14 రోజుల ఇంక్యుబేటర్ పీరియడ్ ఉంటుంది. కానీ.. ఇప్పుడు అంతకన్నా ఎక్కువరోజుల పాటు వైరస్ యాక్టివ్ గా ఉండటాన్ని అక్కడి సైంటిస్టులు గుర్తించారు.
Also Read : లవర్ కోసం డ్రగ్స్ తెస్తూ....?
బ్రెజిల్ కు చెందిన ముగ్గురిలో విలక్షణమైన కరోనా లక్షణాలను గుర్తించారు. ఆ ముగ్గురికీ.. నిరంతరాయంగా 70 రోజులుగా కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ.. ప్రతిరోజూ పాజిటివ్ రిపోర్టే వస్తుందని అధ్యయనంలో తేలింది. కరోనా సోకిన కొందరు వ్యక్తుల్లో వైరస్ ఎక్కువ రోజులపాటు యాక్టివ్గా ఉంటుందని సైంటిస్టులు తేల్చేశారు. ఈ తరహా కేసులను సాధారణ కేసులుగా పరిగణించలేమని సైంటిస్టులు చెప్తున్నారు. ఫ్రాంటియర్స్ ఇన్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన ఈ కొత్త స్టడీ రిపోర్టును పరిశీలిస్తే.. కరోనావైరస్ ఎంతకాలం యాక్టివ్ గా ఉంటుందోనన్న ప్రశ్న తలెత్తుతోంది.
Also Read : ఫీవర్ సర్వే... 4 లక్షల మందికి కోవిడ్ లక్షణాలు
ఈ అధ్యయనంలో భాగంగా 38 మంది బ్రెజిలియన్ కరోనా బాధితులపై పరిశోధకులు అధ్యయనం చేశారు. వారికి కరోనా నెగటివ్ వచ్చేంతవరకు ఆగకుండా టెస్టులు చేస్తూనే వచ్చారు. వారిలో ముగ్గురికి 70 రోజులకు పైగా పాజిటివ్ వచ్చింది. ఇద్దరు పురుషులు, ఒక మహిళ కు పాజిటివ్ అని తేలింది. మహిళకు 71 రోజులు పాజిటివ్ రాగా.. పురుషుల్లో ఒకరికి 81 రోజులు పైగా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. వారిలో లక్షణాలు స్వల్పంగానే ఉన్నప్పటికీ వైరస్ మాత్రం యాక్టివ్ గానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
Next Story