Fri Nov 22 2024 15:26:44 GMT+0000 (Coordinated Universal Time)
గుండ్రంగా తిరుగుతున్న గొర్రెలు.. కారణమేంటో చెప్పిన ఇంగ్లండ్ ప్రొఫెసర్
గొర్రెలన్నీ ఓ చోట చేరి వృత్తాకారంలో తిరుగడం మొదలుపెట్టాయి. తొలుత కొన్నిగొర్రెలు గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత
చైనాలో పదుల సంఖ్యలో గొర్రెలు గుండ్రంగా తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తున్నాయి. 14 రోజులుగా అవి అలుపు సొలుపు లేకుండా తిరుగుతుండటం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. గతవారం గొర్రెలు గుండ్రంగా తిరుగుతున్న వీడియోను చైనా అధికారిక మీడియా తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. ఇన్నర్ మంగోలియాకు చెందిన ఓ వ్యక్తి వందల సంఖ్యలో గొర్రెలను పెంచుతున్నాడు. అతని గొర్రెల ప్రవర్తనలో ఇటీవల మార్పులొచ్చాయి.
గొర్రెలన్నీ ఓ చోట చేరి వృత్తాకారంలో తిరుగడం మొదలుపెట్టాయి. తొలుత కొన్నిగొర్రెలు గుండ్రంగా తిరగడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత మరికొన్ని గొర్రెలు కూడా ఆ గుంపులో చేరి తిరగడం మొదలుపెట్టాయి. నవంబరు 4న మొదలైన ఈ వింత ప్రవర్తన ఈ నెల 16న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసే వరకు కొనసాగింది. గొర్రెలు ఇలా వృత్తాకారంలో తిరుగుతూ వింతగా ప్రవర్తిస్తుండడానికి లిస్టెరియోసిస్ బ్యాక్టీరియా కారణం కావొచ్చన్నారు నిపుణులు. ఇది సోకితే 'సర్క్లింగ్' వ్యాధి వస్తుందని, ఆ వ్యాధి వచ్చిన గొర్రెలు 48 గంటల్లోనే మరణిస్తాయని, ఇవి మాత్రం వారాలతరబడి తిరుగుతూనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తాజాగా గొర్రెల వింత ప్రవర్తనకు కారణమేంటన్న విషయాన్ని ఇంగ్లండ్‌లోని హార్ట్‌ప్యూరీ యూనివర్సిటీలోని వ్యవసాయ విభాగాధిపతి ప్రొఫెసర్ మ్యాట్‌బెల్ వెల్లడించారు. మాంసాహారుల నుండి, జంతువుల వేట నుండి తమని తాము కాపాడుకునేందుకు ఇలా ప్రవర్తిస్తాయన్నారు. కానీ ఈ గొర్రెలను చూస్తుంటే.. ఫ్రస్ట్రేషన్ తో తిరుగుతున్నట్లు అనిపిస్తుందన్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇలాంటి మూసపద్ధతిని అనుసరిస్తున్నాయని, ఇది వాటి మనుగడకే మంచిది కాదన్నారు.
Next Story