Sat Nov 23 2024 01:19:17 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తగా 8వ ఖండం గుర్తింపు.. 375 ఏళ్లుగా కనిపించకుండా పోయింది
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా? అంటే ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు..
ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా? అంటే ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు. దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్నితాజాగా గుర్తించారు. కొత్త ఖండానికి‘జీలాండియా’ లేదా ‘టె రీ-ఆ-మౌ’ అనే పేరు కూడా పెట్టారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు ‘టెక్టోనిక్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. జీలాండియా విస్తీర్ణం 1.89 మిలియన్ చదరపు మైళ్లని, మడగాస్కర్ కంటే ఆరు రెట్లు ఎక్కువని బీబీసీ తెలిపింది.
ఈ కొత్త ఖండం దాదాపు 94 శాతం నీటి అడుగు భాగానే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. న్యూజిలాండ్ మాదిరిగా కేవలం కొన్ని ద్వీపాలు మాత్రమే పైకి కనిపిస్తున్నాయి. సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించిన రాళ్ల నమూనాలను అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. వీటిలో ఎక్కువ భాగం డ్రిల్లింగ్ సైట్ల నుంచి వచ్చినవని మరికొన్ని ఈ ప్రాంతంలోని ద్వీపాల తీరాల నుంచి సేకరించినవని అన్నారు. రాతి నమూనాల అధ్యయనంలో పశ్చిమ అంటార్కిటికాలోని భౌగోళిక నమూనాలు శాస్త్రవేత్తలకు కనిపించాయి. దీన్నిబట్టి న్యూజిలాండ్ పశ్చిమ తీరం క్యాంప్‌బెల్ పీఠభూమికి సమీపంలో సబ్డక్షన్ జోన్ లో జీలాడియా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.
కొత్తగా రూపొందించిన మ్యాప్ ప్రకారం.. జీలాండియా ఖండం భూఅయస్కాంత రేఖ మాత్రమే కాకుండా ఇతర ప్రధాన భౌగోళిక లక్షణాలను కూడా కలిగి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా, జీలాండియా వాస్తవానికి పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగమని భావిస్తున్నారు. గోండ్వానా సుమారు 550 మిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక జీలాండియా అధ్యయనం చేయడం ఎప్పుడూ సంక్లిష్టమేనని శాస్త్రవేత్తలు చెప్పారు. సముద్రపు అడుగుభాగం నుంచి సేకరించిన రాళ్లు, అవక్షేప నమూనాలను అధ్యయనం చేస్తున్నామన్నారు. జీలాండియా వాస్తవానికి పురాతన సూపర్ ఖండమైన గోండ్వానాలో భాగంగా ఉందని అధ్యయనకారులు చెబుతున్నారు.
Next Story