Sun Dec 29 2024 14:19:00 GMT+0000 (Coordinated Universal Time)
సోలోమాన్ దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు ?
మరోవైపు భూకంపం కారణంగా రాజధాని హోనియారా అంధకారంలో చిక్కుకుంది. సోలోమాన్ ఐలాండ్స్ వాతావరణ సంస్థ ప్రకంపనలు ..
తీవ్ర భూకంపాలు, సునామీలకు పుట్టినిల్లైన పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి భారీ ప్రకంపనలుు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.0 గా నమోదైంది. భారీస్థాయిలో ప్రకంపనలు రావడంతో సాల్మన్ దీవుల రాజధాని హోనియారాలో భవంతులు తీవ్రంగా ఊగిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భవనాలు ఊగడంతో భయంతో ఇళ్లనుండి బయటకు పరుగులు తీశామన్నారు. దాదాపు 20 సెకన్ల పాటు ప్రకంపనలు కొనసాగినట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు భూకంపం కారణంగా రాజధాని హోనియారా అంధకారంలో చిక్కుకుంది. సోలోమాన్ ఐలాండ్స్ వాతావరణ సంస్థ ప్రకంపనలు మొదలవ్వగానే సునామీ హెచ్చరికలు జారీ చేసి..కొద్దిసేపటికి ఉపసంహరించుకుంది. అమెరికా భాగస్వామ్య సంస్థ పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ దీనిపై స్పందిస్తూ పెను ముప్పు తప్పిందని, లేకపోతే భారీ సునామీ ముంచెత్తేదని వెల్లడించింది. నిన్న ఇండోనేషియాలో వచ్చిన భారీ భూకంపం ధాటికి 162 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. వరుస భూకంపాల నేపథ్యంలో.. ప్రజల్లో సునామీ వస్తుందన్న భయం మొదలైంది.
Next Story