Mon Dec 23 2024 00:15:06 GMT+0000 (Coordinated Universal Time)
నవజాత శిశువుల్ని చంపిన తల్లి.. ఏళ్ల తరబడి అందులో దాచి ?
2018లో ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. నవజాత శిశువుని చంపి ఫ్రిడ్జ్ లో ఉంచింది. 2019లో మరో పాప పుట్టగా.. ఆ శిశువుని కూడా ..
రోజురోజుకూ మానవత్వ విలువలు దిగజారిపోతున్నాయి. మనుషులకంటే జంతువులే మేలు అనుకునేలా ఘోరాలు వెలుగుచూస్తున్నాయి. 2018, 2019లో పుట్టిన ఇద్దరు నవజాత శిశువులను చంపేసిన తల్లి.. మృతదేహాలను ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది. డెలివరీ తర్వాత పిల్లల పేర్లు నమోదు కాకపోవడంతో.. అధికారులు సదరు మహిళను ప్రశ్నించగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన దక్షిణ కొరియాలో వెలుగుచూసింది. అంతర్జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. సువాన్ నగరానికి చెందిన మహిళకు ముగ్గురు సంతానం.
2018లో ఆమె ఒక పాపకు జన్మనిచ్చింది. నవజాత శిశువుని చంపి ఫ్రిడ్జ్ లో ఉంచింది. 2019లో మరో పాప పుట్టగా.. ఆ శిశువుని కూడా కర్కశంగా చంపేసి, ఫ్రిడ్జ్ లో దాచిపెట్టింది. ఆసుపత్రిలో డెలివరీ అయినట్లు రికార్డులు ఉన్నాయి. కానీ పిల్లల పేర్లు నమోదు చేసినట్లు లేకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. ఆరా తీయగా ఈ దారుణం వెలుగు చూసింది. తన నవజాత శిశువులను చంపినట్లు ఆ మహిళ అంగీకరించింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే పిల్లల్ని చంపినట్లు తెలిపింది. అయితే ఈ హత్యల గురించి తనకు తెలియదని సదరు మహిళ భర్త చెప్పడం పోలీసులను షాక్ కు గురిచేసింది. రెండుసార్లు అబార్షన్ చేయించుకున్నట్లు మాత్రమే చెప్పిందన్నాడు. మహిళపై అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తొలుత ఆ మహిళ దర్యాప్తుకు సహకరించకపోవడంతో.. సెర్చ్ వారెంట్ తో వచ్చి, ఇంట్లో సోదాలు చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఫ్రిడ్జ్ లోని రెండు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను అరెస్ట్ చేశారు.
Next Story