Mon Dec 23 2024 07:57:39 GMT+0000 (Coordinated Universal Time)
ఒకే రోజు లక్ష కరోనా కేసులు
ఫ్రాన్స్ లోనూ కరోనా వ్యాప్తి మొదలయింది. ఫ్రాన్స్ లో ఒక్కరోజులోనే లక్ష కరోనా కేసులు నమోదయినట్లు చెబుతున్నారు
చైనాలో కరోనా తీవ్రత ఎక్కువవుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఫ్రాన్స్ లోనూ కరోనా వ్యాప్తి మొదలయింది. ఫ్రాన్స్ లో ఒక్కరోజులోనే లక్ష కరోనా కేసులు నమోదయినట్లు చెబుతున్నారు. ఒక్కరోజులో 1,04,511 మందికి పాజిటివ్ సోకినట్లు పరీక్షల్లో తేలింది.
కరోనా అలర్ట్...
ఈ మేరకు ఫ్రాన్స్ శానిటరీ అథారిటీ వెల్లడించింది. కరోనా వచ్చిన తర్వాత ఒకే రోజులో అత్యధికంగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని ఫ్రాన్స్ వైద్య శాఖ మంత్రి ఒలీవర్ వెరన్ తెలిపారు. ఫ్రాన్స్ లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నాయని, మరికొద్ది రోజులు ఇదే కంటిన్యూ అవుతుందని కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Next Story