Fri Nov 22 2024 08:45:33 GMT+0000 (Coordinated Universal Time)
చైనాలో మరణ మృదంగం
చైనాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. గత నెలలోనే కేవలం కరోనాతో లక్ష మంది మరణించి ఉండవచ్చని అంచనాలు వినపడుతున్నాయి
చైనాలో కోవిడ్ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. గత నెలలోనే కేవలం కరోనాతో లక్ష మంది మరణించి ఉండవచ్చని అంచనాలు వినపడుతున్నాయి. హెల్త్ డేటా సంస్థ ఎయిర్ఫినిటీ కొన్ని కీలక అంశాలను పేర్కొంది. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా విస్తరిస్తుండటంతో ఆసుపత్రులు కూడా సరిపోవడం లేదంటున్నారు. ఇప్పటి వరకూ రోజుకు తొమ్మిది వేల మంది మరణిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొనడం ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది.
రోజుకు 9 వేల మంది...
ఇప్పటి వరకూ 1.8 కోట్ల మంది కరోనా వైరస్ బారిన పడి ఉండవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. ఈ నెలలో రోజుకు 34 లక్షల కేసులు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. అయితే చైనా ప్రభుత్వం మాత్రం గణాంకాలను బయటకు చెప్పడం లేదు. ప్రజల్లో అలజడి రేగుతుందని భావించి నెంబర్ ను తగ్గించి చెబుతుందని అంటున్నారు. చైనాలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. అనేక దేశాలు తమ విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తూ పాజిటివ్ వస్తే క్వారంటైన్ కు తరలిస్తున్నారు. అన్ని దేశాలు ముందు జాగ్రత్త చర్యలు అన్ని దేశాలూ ప్రారంభించాయి.
- Tags
- covid virus
- china
Next Story