Mon Dec 23 2024 02:50:18 GMT+0000 (Coordinated Universal Time)
విదేశాలకు పారిపోయే యోచనలో రాజపక్సే ?
ప్రజలను కంట్రోల్ చేసేందుకు సైన్యమే రంగంలోకి దిగినా ప్రజల ఆగ్రహం మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. అధ్యక్ష, ప్రధాని భవనాలపై
శ్రీలంకలో నెలకొన్న దుర్భర పరిస్థితులను ప్రతిరోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అక్కడ నెలకొన్న ఆర్థిక, ఆహార సంక్షోభం దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. దేశంలో ఇలాంటి పరిస్థితులు రావడానికి కారణం అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ప్రధాని మహీంద రాజపక్సేలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదవులకు రాజీనామాలు చేసి జైలుకు వెళ్లండంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు చేతపట్టి ఆందోళనలు చేస్తున్నారు.
ప్రజలను కంట్రోల్ చేసేందుకు సైన్యమే రంగంలోకి దిగినా ప్రజల ఆగ్రహం మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. అధ్యక్ష, ప్రధాని భవనాలపై దాడులకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రాణాలకు ముప్పు ఉందన్న వార్తలు గుప్పుమన్నాయి. శ్రీలంకలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీంద రాజపక్స ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Next Story