Tue Nov 05 2024 08:10:07 GMT+0000 (Coordinated Universal Time)
శ్రీలంకలో ఎమెర్జెన్సీ
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎమెర్జెన్సీని ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు
శ్రీలంకలో గత కొద్ది రోజులుగా ఆర్థిక సంక్షోభం నెలకొంది. నిత్యావసర వస్తువులు ధరలు అందుబాటులో లేవు. ఆర్థిక సంక్షోభంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడి నివాస భవనం ముందు ప్రజలు పెద్దయెత్తున ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితికి అధ్యక్షుడు కారణమంటూ అధ్యక్ష భవనంలోకి జొరబడ్డారు ఈ సందర్భంగా పోలీసులు లాఠీ ఛార్జి చేయగా అనేక మందికి గాయాలయ్యాయి.
13 గంటలు కోతలు
ప్రజలు తిరగబడుతుండటంతో శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స ఎమెర్జెన్సీని ప్రకటించారు. శ్రీలంకలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడి పోతున్నారు. దీనికి తోడు ఎమెర్జెన్సీని ప్రకటించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్తు సంక్షోభం కూడా తలెత్తింది. ప్రస్తుతం శ్రీలంకలో 13 గంటల పాటు విద్యుత్తు కోతలను అమలు చేస్తున్నారు.
Next Story