Mon Dec 23 2024 16:17:29 GMT+0000 (Coordinated Universal Time)
దొంగ ఒమిక్రాన్.. టెస్టులకు దొరక్కుండా వ్యాపిస్తోంది !
ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 గా పేర్కొన్నారు. ఈ రకం వేరియంట్ ఆర్టీసీపీఆర్ టెస్టులకు దొరక్కుండా విస్తరిస్తోందని ఆందోళన
కరోనా లో ఒమిక్రాన్ ఒక వేరియంట్ అని అందరికీ తెలిసిందే. అందులో మరో దొంగ రకం ఒమిక్రాన్ కూడా ఉందట. అదే ఇప్పుడు తంటాలు తెచ్చిపెడుతోంది. దానిని ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 గా పేర్కొన్నారు. ఈ రకం వేరియంట్ ఆర్టీసీపీఆర్ టెస్టులకు దొరక్కుండా విస్తరిస్తోందని బ్రిటన్ ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే దీనిని దొంగ ఒమిక్రాన్ గా పిలుస్తున్నారు. ఇప్పటికే ఇది 40 దేశాలకు వ్యాపించిందని, యూరప్ వ్యాప్తంగా దీని తీవ్రత ఉండవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ కు సంబంధించి బీఏ.1, బీఏ.2, బీఏ.3 రకాలు ఉన్నట్లు ప్రకటించింది. బీఏ.1 రకం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు వ్యాప్తి చెంది, పాజిటివ్ కేసుల పెరుగుదలకు కారణమవుతోంది. భారత్ లోనూ ఇదే తీవ్రత కనిపిస్తోంది. ప్రస్తుతం బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. డెన్మార్క్ జనవరి 20 నాటికి బీఏ.2 కేసులు దేశంలో సగం ఉంటాయని ప్రకటించింది. బ్రిటన్, డెన్మార్క్ తోపాటు, స్వీడన్, నార్వే, భారత్ లోనూ బీఏ.2 విస్తరిస్తోంది. బీఏ.1 కేసులను బీఏ.2 కేసులు అధిగమించొచ్చని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. బీఏ.1తో పోలిస్తే బీఏ.2లో 28 వినూత్నమైన మ్యూటేషన్లు కనిపించాయి. అందుకే అది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్ గా చూపించడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు.
Next Story