Tue Apr 01 2025 22:58:19 GMT+0000 (Coordinated Universal Time)
టెక్సాస్ లో మరోసారి తుపాకీ కలకలం.. విద్యార్థి అరెస్ట్ !
ఉదయం 11.30 గంటల సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోనే సాల్వడోర్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు తన పుట్టినరోజు ..

అమెరికా : అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఓ స్కూల్లో మరోసారి తుపాకీ కలకలం రేగింది. ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లో 18 ఏండ్ల యువకుడు మారణహోమం సృష్టించి 24 గంటలైనా గడవకుండానే.. మరో విద్యార్థి తుపాకీ పట్టుకుని తిరగడం కలకలం రేపింది. టెక్సాస్లోని రిచర్డ్సన్ స్కూల్లో ఓ హైస్కూల్ విద్యార్థి తుపాకీతో తిరుగుతుండగా పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విద్యార్థిని విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు.
కాగా.. ఆ విద్యార్థి తుపాకీతో ఎలాంటి కాల్పులు జరపకముందే పోలీసులు అరెస్టు చేయడంతో.. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్లోనే సాల్వడోర్ రామోస్ అనే 18 ఏళ్ల యువకుడు తన పుట్టినరోజు సందర్భంగా.. తుపాకీ కొనుగోలు చేసి.. ఉన్మాదానికి పాల్పడ్డాడు. ముందుగా తన నానమ్మను కాల్చి చంపేశాడు. ఆ తర్వాత స్కూల్ కి వెళ్లి.. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో..21 మంది మరణించారు. వారిలో 19 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతున్న రామోస్ పై పోలీసులు కాల్పులు జరపడంతో.. అతను కూడా హతమయ్యాడు.
Next Story