Mon Dec 23 2024 14:42:02 GMT+0000 (Coordinated Universal Time)
క్రిస్మస్ వేళ మారణహోమం.. ఆత్మాహుతి దాడిలో6గురు మృతి
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు సాయంత్రం 7 గంటల సమయంలో నార్త్ కివూ ప్రావిన్స్ లోని
క్రిస్మస్ వేళ ఉగ్రవాదులు మారణహోమాన్ని సృష్టించారు. ఆత్మాహుతి దాడిలో 6గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఈ తీవ్ర విషాద ఘటన కాంగోలో చోటుచేసుకుంది. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవులు సాయంత్రం 7 గంటల సమయంలో నార్త్ కివూ ప్రావిన్స్ లోని బేని నగరంలోని ఓ బార్ కి వెళ్లారు. అక్కడ సెలబ్రేషన్స్ జరుగుతుండగా.. పేలుడు పదార్థాలతో ఓ వ్యక్తి బార్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ.. అతడిని సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
సిబ్బంది అడ్డుకోవడంతో.. ఆ ఉగ్రవాది బార్ ఎంట్రన్స్ వద్దే బాంబ్ ను పేల్చివేశాడు. బాంబ్ బ్లాస్ట్ అనంతరం కొందరు బార్ పై కాల్పులు జరిపారు. ఈ మొత్తం ఘటనలో 6గురు మృతి చెందినట్లుగా నార్త్ కివు గవర్నర్ వెల్లడించారు. బాంబు పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగ కమ్మేయడంతో బార్ లోపల ఉన్నవాళ్లు బయటికి వెళ్లలేక అక్కడే ఉండిపోవడంతో.. తొక్కిసలాట జరిగిందని ఆయన వివరించారు. కాగా.. ఉగాండాకు చెందిన ఏడీఎఫ్ ఉగ్రవాద సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.
Next Story