Mon Dec 23 2024 19:54:11 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ ప్రధానిని చంపాక.. షూటర్ ఏమి చెప్పాడంటే..?
కాల్పులు జరిపిన వ్యక్తిని 41 ఏళ్ల టెత్సుయా యమగామిగా గుర్తించి, సంఘటనా స్థలంలో పట్టుకుని అరెస్టు చేశారు.
జపాన్ మాజీ ప్రధాని షింజో అబేను కాల్చి చంపారు. పశ్చిమ జపాన్ నగరమైన నారాలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న షింజో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 67 ఏళ్ల షింజే ఓ వీధిలో ప్రసంగిస్తున్న సమయంలో కాల్పులు జరిగాయి. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. "నా ప్రియ మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. మా ఆలోచనలు, ప్రార్థనలు అతనితో, అతని కుటుంబం, జపాన్ ప్రజలతో ఉన్నాయి" అని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో రాశారు.
కాల్పులు జరిపిన వ్యక్తిని 41 ఏళ్ల టెత్సుయా యమగామిగా గుర్తించి, సంఘటనా స్థలంలో పట్టుకుని అరెస్టు చేశారు. తుపాకీతో అబేపై దాడికి పాల్పడ్డాడు.నారా నివాసి యమగామి, జపనీస్ నావికాదళం 'జపనీస్ మారిటైమ్ సెల్ఫ్-డిఫెన్స్ ఫోర్స్'లో గతంలో పని చేశాడు. అతను అబేను కాల్చడానికి ఉపయోగించిన తుపాకీ హ్యాండ్ మేడ్ అని చెప్పుకొచ్చారు. యమగామి.. తాను జపాన్ మాజీ ప్రధాని అబే పట్ల అసంతృప్తిగా ఉన్నానని, చంపాలనే ఉద్దేశ్యంతో అతన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపినట్లు ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఈ ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. "జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గురించి వచ్చిన వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది." అని చెప్పుకొచ్చారు.
News Summary - Suspect in Shinzo Abe shooting ex-member of Japanese Navy, used handmade gun
Next Story