Sat Dec 21 2024 04:47:27 GMT+0000 (Coordinated Universal Time)
యువకుడిని చంపి.. మార్కెట్లో బహిరంగంగా వేలాడదీశారు
ఆగస్ట్ 2021లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాలిబాన్ అనేక మంది మాజీ భద్రతా దళాల అధికారులు
తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్తాన్లోని బగ్లాన్లో తాలిబన్లు ఒక యువకుడిని కాల్చి చంపి, అతని మృతదేహాన్ని అందరబ్ జిల్లా మార్కెట్లో బహిరంగంగా ప్రదర్శించారు. ఈ హత్యను వ్యతిరేకిస్తూ మృతదేహంతో స్థానికులు నిరసన ప్రదర్శన చేశారు. సంఘటనకు సంబంధించి తాలిబన్ నుండి వివరణ కోరినట్లు ఆఫ్ఘనిస్తాన్ వార్తా సంస్థలను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.
తాలిబన్లు అందరబ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న వ్యక్తిని అతని ఇంటి నుండి బయటకు రమ్మని చెప్పారు. ఆ తర్వాత అతన్ని హత్య చేశారని ఆఫ్ఘన్ వార్తా సంస్థలు తెలిపాయి. ఈ చర్యకు వ్యతిరేకంగా జిల్లా భవనం ముందు గుమిగూడిన ప్రజలను చెదరగొట్టేందుకు గాలిలో కాల్పులు జరిపారు.
ఆగస్ట్ 2021లో అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాలిబాన్ అనేక మంది మాజీ భద్రతా దళాల అధికారులు, ఉద్యోగులను హతమార్చినట్లు ఆఫ్ఘనిస్తాన్లోని ఐక్యరాజ్యసమితి సహాయ మిషన్ (UNAMA) నివేదిక వెల్లడించిన ఒక రోజు తర్వాత ఈ యువకుడి హత్య జరిగింది. 2021లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పడగొట్టి, దేశాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత తాలిబాన్ పలు నేరాలకు పాల్పడ్డారు.
News Summary - Taliban Shoot Dead Young Man Display His Body to the Public
Next Story