Fri Apr 18 2025 08:55:41 GMT+0000 (Coordinated Universal Time)
పునఃప్రారంభమైన వాట్సాప్ సేవలు
2 గంటల తర్వాత వాట్సాప్ టెక్నికల్ టీమ్.. ఈ సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది. మరోవైపు..

ఈ టెక్నాలజీ యుగంలో స్మార్ట్ మొబైల్ వాడని వారు ఉండరు. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరూ ఉపయోగించే యాప్ వాట్సాప్. ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన వాట్సాప్ సేవలు నేటి మధ్యాహ్నం సుమారు 2 గంటల సేపు నిలిచిపోయాయి. భారత్ సహా వివిధ దేశాలలో వాట్సాప్ సేవలకు అంతరాయం కలిగింది. మెసేజ్ లు సెండ్, రిసీవ్ కాకపోవడంతో వినియోగదారులు కంగారుపడ్డారు. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు.
2 గంటల తర్వాత వాట్సాప్ టెక్నికల్ టీమ్.. ఈ సమస్యను పరిష్కరించింది. సర్వీసులను పునరుద్ధరించింది. మరోవైపు, సమస్య ఏమిటనేది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. కాసేపట్లో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించవచ్చని తెలుస్తోంది. చాలాసేపటి తర్వాత వాట్సాప్ పునరుద్ధరణ కావడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. వాట్సాప్ సేవలు ఆగిపోవడంతో యాజమాన్యం కూడా అధికారికంగా స్పందించకపోవడంతో అంతా గందరగోళానికి గురయ్యారు.
Next Story