Mon Dec 23 2024 14:25:56 GMT+0000 (Coordinated Universal Time)
ఫిలిప్పీన్స్ లో తెలంగాణ విద్యార్థి అనుమానాస్పద మృతి
మణికాంత్ స్వస్థలం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామం. మణికాంత్ 8 నెలల క్రితం..
ఇటీవల తెలంగాణకు చెందిన కొందరు విద్యార్థులు వివిధ రకాల కారణాలతో విదేశాల్లో మరణిస్తున్నారు. ఖమ్మంకు చెందిన వైద్యవిద్యార్థి, హైదరాబాద్ కు చెందిన ఏరోనాటిక్స్ విద్యార్థిని మరణించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణకు చెందిన మరో విద్యార్థి మణికాంత్ ఫిలిప్పీన్స్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
మణికాంత్ ఫిలిప్పీన్స్ లో మెడిసిన్ చదువుతున్నాడు. అతను మరణించినట్లు కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపింది. మణికాంత్ స్వస్థలం తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామం. మణికాంత్ 8 నెలల క్రితం మెడిసిన్ చదివేందుకు ఫిలిప్పీన్స్ వెళ్లాడు. మణికాంత్ ఎలా చనిపోయాడన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. అతని మరణవార్తతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. డాక్టర్ గా తిరిగి వస్తాడనుకున్న కొడుకు ఇకలేడని తెలిసి ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Next Story