Mon Dec 23 2024 09:50:09 GMT+0000 (Coordinated Universal Time)
దుబాయి మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధులతో తెలంగాణ బృందం సమావేశం
దుబాయి లోని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రెనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత డా. అహ్మద్ అల్ హాష్మి, సెక్రెటరీ రిజి జాయ్ తో బుధవారం తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సమావేశం జరిగింది.
దుబాయి లోని మిడిల్ ఈస్ట్ సెంటర్ ఫర్ ట్రెనింగ్ అండ్ డెవలప్మెంట్ అధినేత డా. అహ్మద్ అల్ హాష్మి, సెక్రెటరీ రిజి జాయ్ తో బుధవారం తెలంగాణ గల్ఫ్ సంఘాల ప్రతినిధులు సమావేశం జరిగింది.
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే కార్మికుల కోసం భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒకరోజు ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ గురించి మంద భీంరెడ్డి మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధులకు వివరించారు. భారత ప్రభుత్వం ప్రచురించిన అవగాహన పుస్తకాలను వారికి బహుకరించారు. గల్ఫ్ వలస కార్మికుల కోసం భారత ప్రభుత్వం చేపట్టిన మదద్' 'ఈ-మైగ్రేట్' వ్యవస్థల గురించిన సమాచార పత్రాలను ఇచ్చారు.
గమ్యస్థాన గల్ఫ్ దేశమైన యూఏఈ లోని దుబాయికి చేరుకున్న అన్ని దేశాల కార్మికులకు, ఉద్యోగులకు వారు నిర్వహించే 'పోస్ట్ అరైవల్ ఓరియెంటెషన్' అవగాహన కార్యక్రమాల గురించి మిడిల్ ఈస్ట్ సెంటర్ ప్రతినిధులు వివరించారు.
ఇండియా నుంచి దుబాయికి వచ్చిన ప్రతినిధులు మంద భీంరెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, దుబాయిలో నివసిస్తున్న రేండ్ల శ్రీనివాస్, రాణి కోట్ల , బీరెల్లి తిరుమల్ రావు, కిరణ్ కుమార్ పీచర పాల్గొన్నారు.
Next Story