Wed Jan 08 2025 23:15:09 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికా అధ్యక్షుడి హత్యకు తెలుగు యువకుడి కుట్ర ?
పోలీసులు సాయివర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు..
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను చంపేందుకు యత్నించాడంటూ అక్కడి పోలీసులు సోమవారం ఓ తెలుగు యువకుడిని అరెస్ట్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో కందుల సాయివర్షిత్ (19) అనే యువకుడు శ్వేతసౌధం ఉత్తర భాగంవైపుకి ఓ భారీ ట్రక్కుతో దూసుకొచ్చాడు. భద్రత కోసం అక్కడ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్ ను ఢీ కొట్టి.. మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నించాడు. సాయివర్షిత్ నడిపిన ట్రక్కుకు నాజీ జెండా ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
పోలీసులు సాయివర్షిత్ ను అదుపులోకి తీసుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్, ఆస్తుల ధ్వంసంతో పాటు అధ్యక్షుడు జో బైడెన్ హత్యకు కుట్ర పన్నినట్లు అతడిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల విచారణలో సాయివర్షిత్ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. ఆరునెలలుగా ఈ దాడికి ప్లాన్ చేసినట్లు చెప్పాడని తెలుస్తోంది. కాగా.. ఛెస్ట్ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయివర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story