Mon Dec 23 2024 14:13:14 GMT+0000 (Coordinated Universal Time)
అమెరికాలో పోలీస్ వాహనం ఢీ కొని.. ఆదోని యువతి మృతి
అంబులెన్స్ లో యువతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదంలో..
అమెరికాలోని సియాటిల్ నగరంలో జరిగిన రోడ్డుప్రమాదంలో తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింగి. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ కార్ ఢీ కొట్టడంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి. అంబులెన్స్ లో యువతిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ ప్రమాదంలో మరణించిన యువతిని ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవిగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.
సియాటిల్ లో నివసిస్తున్న జాహ్నవి.. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో థామస్ స్ట్రీట్ లో నడుస్తూ వెళ్తోంది. అదే సమయంలో వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీ కొట్టింది. ప్రమాదానికి కారణమైన అధికారి 2019 నుండి విధులు నిర్వహిస్తున్నట్లు సియాటిల్ పోలీసులు తెలిపారు. కానీ అతని వ్యక్తిగత వివరాలను మాత్రం వెల్లడించలేదు.
Next Story