Tue Nov 05 2024 19:34:56 GMT+0000 (Coordinated Universal Time)
Modi at United Arab Emirates : అబుదాబిలో .. ఆధ్యాత్మిక వాతావరణం... హిందూ ఆలయం.. నేడు ప్రారంభం
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దేవాలయం. ఊహకు అందని విషయం సాక్షాత్కరమైంది. అబుదాబిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది
Modi at United Arab Emirates :యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో దేవాలయం. ఊహకు అందని విషయం సాక్షాత్కరమైంది. అబుదాబిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాదాపు 27 ఎకరాల్లో శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామిననారాయణ సంస్థ ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ప్రారంభించనున్నారు. అబుదాబిలో హిందూ ఆలయ నిర్మాణాన్ని ఎవరూ ఊహించలేదు. అసలు సాధ్యపడుతుందా? అని కలలో కూడా అనుకోలేదు. కానీ ఇది నిజం. అబుదాబిలో ఒక హిందూ దేవాలయం నిర్మాణానికి నోచుకోవడం ఇదే మొదటి సారి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇది మొదటి రాతి నిర్మాణంతో చేపట్టిన ఆలయంగా భావిస్తున్నారు.
మోదీ చేతులు మీదుగా...
ఇప్పటికే యూఏఈ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆలయాన్ని ఈరోజు ప్రారంభించనున్నారు. యూఏఈలో దాదాపు ముప్ఫయి లక్షల మంది వరకూ భారతీయులున్నారు. వీరిలో అత్యధికులు హిందువులే కావడం గమనార్హం. ఇప్పటికే దుబాయ్ లో రెండు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన గురుద్వారాలు కూడా ున్నాయి. అయితే పూర్తిగా హిందూ నిర్మాణ శైలితో ఏర్పాటయిన ఆలయం ఇదే నని చెబుతన్నారు. దుబాయ్ - అబుదాబి హైవే సమీపంలోని దాదాపు 27 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇందుకు 700 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. మూడున్నరేళ్లకు పైగా ఈ ఆలయ నిర్మాణం సాగింది. ఆలయ నిర్మాణంలో గుజరాత్, రాజస్థాన్ కార్మికులు పాల్గొన్నారు.
భూకంపాలను తట్టుకునేలా....
ఆలయనిర్మాణానికి వాడిన రాయి కూడా రాజస్థాన్ నుంచి తెప్పించారు. శిల్పాలను కూడా రాజస్థాన్ లోని భరత్ పూర్ నుంచి రప్పించారు. ఆలయంలోపల భాగంలో ఇటాలియన్ మార్బుల్ ను వినియోగించినట్లు తెలిపారు. భూకంపాలను తట్టుకునేందుకు, అబుదాబిలో ఉష్ణోగ్రతలకు ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండేందుకు పునాదుల్లో సెన్సార్లను ఏర్పాటు చేశారు. నిపుణులైన ఇంజినీర్లు ఈ ఆలయనిర్మాణాన్ని చేపట్టారు. ఆలయంలో ప్రార్థన మందిరంతో పాటు ఆధ్మాత్మికతతో పాటు టూరిజం స్పాట్ గా కూడా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణంలో థీమాటిక్ గార్డెన్, లైబ్రరీ, గ్యాలరీ వంటివి కూడా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని ప్రారంభించే ముందు సనాతన ధర్మం ప్రకారం యజ్ఞాలు నిర్వహించారు.
Next Story