Fri Nov 22 2024 23:15:22 GMT+0000 (Coordinated Universal Time)
రెచ్చిపోయిన రష్యా వేర్పాటు వాదులు.. ఉక్రెయిన్ నర్సరీ స్కూల్ పై బాంబులు
నర్సరీ స్కూల్ లో చిన్నారులు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో స్కూల్ జిమ్ పై బాంబులతో దాడి చేశారు. మరో 15 నిమిషాల్లో చిన్నారులు
ఉక్రెయిన్ లో పరిణామాలు రోజురోజుకూ అక్కడి ప్రజలకు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఏ క్షణానైనా రష్యా బలగాలు ఉక్రెయిన్ పై విరుచుకు పడేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆ దేశంలో నెలకొన్ని పరిస్థితులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. తాజాగా రష్యా అనుకూల వేర్పాటువాదులు రెచ్చిపోయారు. ఉక్రెయిన్ లోని ఓ నర్సరీ స్కూల్ పై బాంబుల వర్షం కురిపించారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది.
నర్సరీ స్కూల్ లో చిన్నారులు బ్రేక్ ఫాస్ట్ చేస్తున్న సమయంలో స్కూల్ జిమ్ పై బాంబులతో దాడి చేశారు. మరో 15 నిమిషాల్లో చిన్నారులు జిమ్ క్లాస్ కు వెళ్లాల్సి ఉండగా.. బాంబుల దాడి జరగడంతో చిన్నారులు ఉలిక్కిపడ్డారు. జిమ్ క్లాస్ కాస్త ముందుగా నిర్వహించి ఉంటే తీరని ప్రాణనష్టం జరిగేదని ఆ స్కూల్ టీచర్లు వాపోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న ఘర్షణలు రోజురోజుకూ మరింత తీవ్రరూపాన్ని దాల్చుతున్నాయి. సరిహద్దులకు పెద్దఎత్తున తన సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని రష్యా తరలించినట్లుగా అమెరికా ఆరోపిస్తోంది. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి తాము చేస్తోన్న చేస్తోన్న ప్రయత్నాలేవీ ఫలించట్లేదని అమెరికా ఓవైపు చెబుతుండగా… రష్యా యధావిధిగా అగ్రరాజ్యం ఆరోపణలను ఖండిస్తోంది.
Next Story