Sun Dec 22 2024 22:43:17 GMT+0000 (Coordinated Universal Time)
రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మంతి ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు
రష్యాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 70 మంతి ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. అయితే మరణాలపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. రషయాలోని కోమిలోని పాసింజర్ రైలు పట్టాలు తప్పడంతో తొమ్మిది కోచ్ లు బోల్తాపడ్డాయి. దీంతో 70 మంది గాయాలపాలయ్యారు.
70 మందికి గాయాలు...
వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రైలులో మొత్తం 232 మంది ప్రయాణికులున్నారని అధికారులు తెలిపారు. ఆ మార్గంలో మిగిలిన రైళ్ల రాకపోకలను నిలిపేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్లనే రైలు పట్టాలు తప్పిందని ప్రాధమిక విచారణలో తేల్చారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు.
Next Story