Mon Dec 23 2024 06:45:07 GMT+0000 (Coordinated Universal Time)
Russia : రష్యాలో తెగబడిన ఉగ్రవాదులు ..60 మంది మృతి
రష్యాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అరవై మంది మరణించారు
రష్యాలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో అరవై మంది మరణించారు. మాస్కోలోని కాన్సర్ట్ హాలుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. హాలులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు ఇష్టం వచ్చిన విధంగా కాల్పులు జరపడంతో పెద్ద సంఖ్యలో మృతి చెందారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తింది. క్రాకస్ సిటీ క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో ప్రవేశించిన ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడి వారిలో అనేక మంది పరిస్థితి విషమంగా ఉంది.
విచక్షణ రహితంగా...
మిలటరీ దుస్తుల్లో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఏం జరుగుతుందో అర్థంకాక హాలులో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భయకంపితులై బయటకు పరుగులు తీసేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా తొక్కిసలాట కూడా జరిగింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాలులో మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారు. అయితే హాలులో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు మాత్రం తమ పని ముగించుకుని వెంటనే వెళ్లిపోయారు.
ఉగ్రవాదుల కోసం...
వాళ్ల కోసం మాస్కో ఆర్మీ వెదుకుతోంది. దాడి చేసి తప్పించుకున్న ఉగ్రవాదులను పట్టుకోవడం కోసం దేశమంతా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఉగ్రవాదుల్లో ఒకరు దొరికినట్లు సమాచారం. అయితే ఈ కాల్పులు ఎందుకు జరిపారో మాత్రం అర్థం కాలేదు. అయితే పుతిన్ మాత్రం ఈ దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్బబోమని తెలిపారు. రెండు దశాబ్దాల్లో రష్యాలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడిగా దీనిని భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితేమాస్కోలో దాడి చేసింది తామేనని ఐసిస్ ప్రకటించింది. దాడి చేసిన తమ వారు సురక్షితంగా తప్పించుకున్నారని కూడా పేర్కొంది.
Next Story