Mon Dec 23 2024 11:18:18 GMT+0000 (Coordinated Universal Time)
అక్కడ గంజాయ్ కేఫ్ లు.. ఎంజాయ్
థాయ్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగును, వినియోగాన్ని చట్టబద్దం చేస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది.
థాయ్లాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి సాగును, వినియోగాన్ని చట్టబద్దం చేస్తూ ఆ దేశం నిర్ణయం తీసుకుంది. గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్లాండ్ రికార్డు సృష్టించింది. గంజాయిని అన్ని దేశాలు దాదాపు నిషేధించాయి. ఇటు సాగును, అటు వినియోగాన్ని కూడా ఏ దేశమూ అంగీకరించడం లేదు. అయితే థాయ్లాండ్ దేశం మాత్రం అధికారికంగా గంజాయి విక్రాయాన్ని చట్టబద్దం చేసింది. అయితే గంజాయిని బహిరంగ ప్రదేశాల్లో తాగడాన్ని మాత్రం ఆ దేశం నిషేధించింది.
గంజాయి పెంచడానికి....
గంజాయి వినియోగాన్ని చట్టబద్దం చేయడంతో అక్కడి దుకాణాల్లో బహిరంగ విక్రయాలు మొదలయ్యాయి. నేరుగా దుకాణాల్లోకి వెళ్లి గంజాయిని కొనుగోలు చేస్తున్నారు. గంజాయి తాగడానికి ప్రత్యేకంగా కేఫ్ లను ఏర్పాటు చేశాయి. బహిరంగ ప్రదేశాల్లో తాగితే అరవై వేల జరిమానా విధించడంతో కేఫ్ లకు గిరాకీ పెరిగింది. అయితే గంజాయిని చట్టబద్దం థాయ్లాండ్ ప్రభుత్వం చేయడంతో గతంలో ఈ కేసుల్లో అరెస్ట్ అయిన 4 వేల మందిని ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలుస్తుంది. దేశంగా పది లక్షల గంజాయి మొక్కలను పంపిణీ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఇళ్లల్లో కూడా గంజాయిని పెంచుకునే వీలు కల్పించారు.
Next Story