Fri Nov 22 2024 05:42:06 GMT+0000 (Coordinated Universal Time)
భూకంప శిథిలాల్లోనే బిడ్డకు జన్మనిచ్చి మరణించిన తల్లి
సిరియా భూకంప శిథిలాలు ఓ పుట్టుకకు వేదికైతే మరో మరణానికి కూడా సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఓ బిడ్డ ఈ లోకంలోకి వస్తే..
ఈ క్షణం మాత్రమే మనది. మరుక్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఏ పక్కనుండి ఏ ఆపద వస్తుందో తెలియదు. ఈ నిమిషం కళ్లముందు సంతోషంగా ఉన్నవారు మరునిమిషానికి కనుమరుగవుతున్నాయి. చావుపుట్టుకల మధ్య ఉన్న కాలం క్షణమే అన్నదానికి నిదర్శనంగా కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా.. టర్కీ, సిరియాల్లో సంభవించిన భూకంపాలు ఇందుకు నిదర్శనం. సరిహద్దుల్లో వచ్చిన ప్రకంపనలు.. వేలాది ప్రాణాలను బలితీసుకున్నాయి.
సిరియా భూకంప శిథిలాలు ఓ పుట్టుకకు వేదికైతే మరో మరణానికి కూడా సజీవ సాక్ష్యంగా నిలిచాయి. ఓ బిడ్డ ఈ లోకంలోకి వస్తే మరో ప్రాణం అనంతవాయువుల్లో కలిసిపోయింది. భూకంపంతో అల్లాడుతున్న సిరియాలో.. భవనాల శిథిలాల కింద ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చి.. కన్నుమూసింది. శవాల దిబ్బలతో మరుభూమిని తలపిస్తోన్న దృశ్యాల్లో.. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఓ బిడ్డ భూమ్మీదికి రావడం ఆశ్చర్య పరిచింది. శిథిలాల తొలగింపు క్రమంలో ఇది గమనించిన స్థానికులు.. ఆ బిడ్డను హుటాహుటిన వైద్యం కోసం తరలించారు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story